వందే జననీ, భారతావనీ స్వేచ్చా సుందర ధరణి హిందూ మహాసాగర తరంగాలు జై హింద్ జై హింద్ జై హింద్ అని నిరంతరం ఘోషిస్తుంటే మంచు పర్వతాల మెరుపులు కిరీట కాంతులై భాసిస్తుంటే మూడు శక్తులు మువ్వన్నెలైస్వేచ్చ గా ఎగురు తుంటే మా హృదయాలు నినదించే వందే జననీ భారతావనీ అని భయ త్యాగం జయ రాగం
సత్య శోధన నిత్య వేదన కర్మాచరణ ధర్మ భావన ప్రాణం శరీరం అన్నీ నీవే నీలి అంచు ఆకుపచ్చ చీర లో
మణి వంటి మంచు కిరీటం తో శక్తి యుక్తి భక్తి వున్న సంతతి తోశోభిల్లే మాదివ్య భూమి - మా భారతావనీ భరతావనీఏ నాదమో యిది
ప్రకృతి కథనమా
జీవన వేదమా
హృదయ స్పందనా
జనన ఖేదం రోదనకాగా; ఆ మొదటి ఏడుపు
అమ్మచెవిని చేరే మధుర గాన మౌతుంది
అమ్మ స్పర్శ లో అనురాగం బిడ్డకు మధుర
క్షీర ధారల పోషణ కారక మాతృత్వ గానం
మాటలు నేర్చే వరకు రోదనలే వాదనలు నాద రాగాలు
జోల పాటలు లాలనలు చిట్టి కధలు గోరు ముద్దలు
ముద్దు మురిపాలు, పొట్టి పాటలు, దాగుడుమూతలు
ఆటలు, అల్లర్లు, కధలు, చదువులు ఎదుగుదలలో
శృతి చేసుకున్న మధుర స్ముతుల బాల రాగాలు
తేనెటీగల ఝంకారాలు,కోయిలల పంచమ స్వరాలు
పేరు తెలియని పిట్టల కిలకిలలుమేఘ మాలికల గంభీర గర్జనలు
అన్నీ యౌవన కాలపు సరాగాలు
పండుటాకుల పసిడి వన్నెలు
మధుర జ్ఞాపకాల తరంగాలు
భూపాలం, కదన కుతూహలం, మధురాలాపం
అభేరి, సావేరి, ఆనంద భైరవి మోహన కళ్యాణి
ధన రంజని , వీర ప్రతాపం వసంత ప్రియ, ఇలా
ఎన్ని రాగాలు పాడినా చివరకు మౌన రాగమే
ఇదీ జీవన నాదమే లోకరంజక తరంగలీలే
తుమ్మ చెట్టు
నీ చులు
హృదయము లేని లోకంలో, మదోన్మత్త ప్రపంచములో
శివ శక్తి
శిరస్సుపైన
జటలతో సురగంగను బంధించి
శశాంకుని
శిఖపై నిలుపుకొన్న భూత నాధుడవు
అఘోర
మూర్తివైన ఆదిదేవుడవు!అంబాపతివి
నికిదే
ప్రణుతి పరమేశ్వరా! ప్రణవ నాద రూపా!
రతీపతిని
దహించిన భూతపతివి
జితేంద్రియుడవు!
మృత్యుంజయుడవు
భక్త
వివశుడవు! దిగంబరుడవు
దయాదురంధరుడవు! తాండవమూర్తివి!
హరుడవు!పురహరుడవు!
సుమ శరుని హరించిన
గరళ కంఠమునకు వ్యాళ భూషణమా?
దిగంబరుడవు, దిగంతముల నెరిగిన వాడివి
నీ దేహ చలన లయ యే విశ్వ చైతన్యం
జ్ఞాన
ధ్వాంతి యే విశ్వశాంతి యా జగత్పతి!
ధిమి
ద్ధిమి యను భీమ పద తాడనం
డమ
డమ యను డమరుక నాదం
భగ్గుమని
దగ్దం చేసే నిటలాక్ష తటిల్లతా విస్ఫులింగం
యివేనా,
తాండవ పద ధృతి, నాద విస్రుతి, లయ భాతి
వేదవిదుడయిన
బ్రహ్మయినా అసత్యదోషం
దండనార్హమేనని
కపాలహస్తుడవైన భిక్షుకుడా
గళమున
గరళము నిలిపినావట మరి
మనిషి
చిత్తము లో విషమేల చేరెనో !
సంసార
మాయా బంధితుడను బాధితుడను,
నట
రాజువై సృష్టి స్థితి లయాది నాటకాన్ని శాసిస్తూ
దక్షిణామూర్తి
వై వివక్షలేని విశ్వబోధకుడ వయ్యవా
ఖలుని
సైతం నీలో లయంచేసుకునే దయాశీలివి!
పంచేంద్రియములున్న
పంచత్వమొందే
పంచభూతాత్మకదేహమిది,
పంచానన; పంచ శర వైరి! ,
చివరకు
మిగిలేది చితా భస్మమని గుర్తు చేస్తూ
విస్మయ
మొందగా భస్మధారివై సంచరించేవా!!
త్రిగుణాలనే
ఆయధాలనిచ్చి గుణాతీతుడ వైన రుద్రుడా
దక్షత
లేని దక్షుని యజ్ఞము నాశము చేసిన వీర భద్రుడా
మూఢ
భక్తి తోలు వలిచి కృత్తివాసుడవైనావు
ఢమరుక
నాదము తో దిగంతముల మేలుకోలిపేవు!
శూలివై,
కాపాలివై, జయ శీలివై, భువన పాలివై
అహంకార
మమకారములే అంధకార హేతువులని
లింగ
భేదము లేక అంగ హీనమైన మహాలింగమైనావు
ఎందరికి
తెలిసేను నీ తత్వం శివత్వ మహత్యం !!!
మనసు
వుంది కానీ తపస్సు లేదు,
బతుకు
తపన వల్ల తాపం వుంది చల్ల బరుచు
హిమాంశు
మౌళి !! పాపం వుందో లేదో తెలీదు
విషాశనా,
మనో విషాన్నిమాత్రం భక్షించు!!
యుక్తి
తో చండిక యై అసురల సంహరించి
అన్నపూర్ణ
యై ఆకలి తీర్చే అమ్మ నీ శక్తి
సర్వమంగళాలింగనముతో
ప్రేమమూర్తి వైనావు
అయినా
అర్ధ నారీశ్వరుడన్న కీర్తి నీది!
భూత
నాదుడవని భీతి లేక నిను చేరాను
అసత్యము
పలుకలేను, ఆది-అంతము లెరుగలేను
చిదాకారమునే
సదా తలచి పరబ్రహ్మకూడా యెరుగలేని
నిను
నుతించ నా తరమా మహాదేవ !
నా
దాహం తీర్చేగంగాధరుడవు,
ఆకలి
తీర్చే అన్నపూర్ణకు పతివి,
చల్లని
చూపున్న సోమనాధుడవు
జ్ఞానమిచ్చే
దక్షిణామూర్తివి!
నీలో
లయంచేసుకునే హరుడవు
నిన్ను
ఆడంబరంగా పూజించ లేను
అద్భుతమైన
శబ్దార్ధములతో కీర్తించలేను
నిలకడతో
నిను ధ్యానించ లేను!
నా
మది మంచు కొండో, మారుభూమో, రణక్షేత్రమో కాదు
నీ
మిది ప్రేమతో భక్తిగా పెంచిన విరి తోట
ఎద్దు
నెక్కి రాకు పశు పతీ, ప్రేమ పాశంతో
అమ్మతో
కలిసి ఆనందించు, ఆశీర్వ దించు!
నీవే
కాంతివి, క్రాంతివి, మోహ ధ్వాంతచ్చితివి
శాంతి
శ్వేతివి, మనో మార్తాండ తాండవ మూర్తి
నీ
దివ్య ద్యుతి, ప్రబోధ ప్రఖ్యాతి, విశ్వ విద్యోతి
గ్రహించ
డానికి మూడో కన్ను లేదు !!
హరా!
భవహరా! శంకరా! శివంకరా,
భక్తవశంకరా!గంగాధరా!
చంద్ర శేఖరా!
నీల
కంధరా!దయా దురంధర! ఉమా వరా!
పరమేశ్వరా,
సర్వ శుభంకరా! పాహి! పాహి!
కైలాసం
చేరే ప్పటికి ఊసులు విలాసాలు వుంటాయా
చిత్తం
గడ్డకట్టి పోతే మోడునో జడుడి నో అవుతా
అందుకే,
ఒక కన్నీటి చుక్కను నీపైరాల్చితే స్వీకరిస్తావా!
మరుభూమి
చేరేప్పటికి మనసు చైతన్యంగా వుంటుందా
అందుకే,
స్పందించే హృదయవనం లోని పూలనిద్దామనుకొన్నా
సుమ
శరుని దహించి నటుల నను దగ్ధము చేయకు
విషయాన్ని
భస్మం చేసి బూది రేణువునైతా స్వీకరిస్తావా
నిర్వికారంగా
ఓంకార నాదంతో నినదిస్తే ఆలకిస్తావా
నువ్వే
కపాల చిప్పతో అడుక్కునే భిక్షుకుడవు,
నా
పుర్రే నీ చేతి లో కొచ్చాక నేనేమీ అడిగేది
అందుకే
నిను మరిచి మనలేను !భయమో! భక్తో!!!
నిన్ను
చేరితే మాయ క్షయమౌతుందేమో!!!కానీ
విషం
తినలేను, చర్మం కట్టలేను, బూది పూసుకో లేను,
భోగి
భాగ్యం భరించ లేను స్మశానం లో వుండలేను!!
నీ
నెత్తి మీది గంగలాగ ఆలోచనలు ఉప్పొంగుతుంటే
వాటిని భక్తి జటలతో బంధించడానికి ప్రయత్నిస్తాలే !!
సిరికన్నాస్థిరమైనదానిని
చూపే వేషధారివి!
మనజెండా
అమృతోత్సవాల
ఆరంభం
జెండా
పండగతో ప్రారంభం
జెండా
రెప రెపల్లో
మువ్వన్నెల
మెరుపుల్లో
జాతీయతా
భావం కళకళ
తెలుగు
దనం తళతళ
ఎందుకంటే
అది తెలుగు వాడి
మేధస్సు
తేజస్సుయశస్సు
జాతీయ
గీతం లో లోపించిన
తెలుగు
వారి వెలుగు లను
సదా
భాసించే లా గర్వంగా
పతాకంగా
రచన చేసిన
అమర
నాద మిది మౌన గీతమిది
తెలుగు
జాతికి గౌరవం తెచ్చిన
అమృత
మయ తెలుగు హృదయం
పింగళి
వెంకయ్య గారి ఖ్యాతి విఖ్యాతి
పతాక
రెప రెపలై విరాజిల్లు తున్న
అమరోత్సవాలు
అమృతోత్సవాలు!
పోనీ! పోనీ! పోతే పోనీ!
పోనీ! పోనీ! పోతే పోనీ! పొయ్యేవే అన్నీ
సముద్రం
ఉదయ కాంతి లో
ఇసుక తిన్నెల పై కూర్చొని
పుస్తకం
“All in one అరచేతిలో cellphone రోజుల్లో
కొత్త దేవుడండి!ఒక్కసారి దర్శించండి!
ఒక్కో యుగానికి ఒక్కో అవతారం ఒక్కో కార్యానికి ఒక్కో రూపం
గగనం
శూన్యం మేఘం ముసుగు
నీడ
మనసు
నలిగి జ్ఞాపకాలు పొంగితే
విపరీత
వైవిధ్యం తో భూగ్రహంపై మాత్రమే కనిపించే
శివోహం!
మహా
దేవా గళమున గరళము నిలిపినావట మరి
మనిషి
చిత్తము లో విషమేల చేరెనో!!!
వైద్యనాధుడవని
ప్రతీతి పొందినావు
వైద్యం
కొరకు నీ దగ్గరకు వస్తే విషం యిచ్ఛావా
లేక
నీ విబూది ధరిస్తే దాన్లోనుండి విషమొచ్చిందా!!
ఆది
దేవుడే మింగాడంటే ఎంత మహిమాన్వితమో
అనుకుంటూ
తాగే నీటిలో పీల్చే గాలిలో తినే తిండి లో
కలుపుకొని,
మరణం జయించే ప్రయత్నంలో
శివో
హం శివో హం శివో హం అనుకుంటున్నాం!!
అమృతం
హరించిన రాహు కేతువులను
సంహరించ
ప్రయత్నించిన దేవతలు
విషం
తింటున్న మనిషిని ఎందుకు వదిలేశారు
విషమే
గదా అన్ననిర్లక్ష్యమో!అవగాహనా రాహిత్యమో!
లేక,
వీడెంత?? మనల్ని ఆశ్రయించి బతికే వాడనో!ఏమో!
అమృతం
లాగే విషానికి నశించే గుణం లేదు విస్తరించడమే
అమృతం
నాకిన దేవతలు మాయమయ్యారు
శివుడి
చేతిలో పరాభవం చెందిన యముడు
నరకాన్ని
నరలోకంలోకి మార్చిఆనందిస్తున్నాడు!
విషం
చేరిన మనుషుల్లో కొందరికి బుద్ధి వికసించిందో
మందగించిందో,
కాపాడలేని వారి ఆశీస్సులేల ?
రకరకాల
రూపాల్లోని దేవుళ్ళ కన్నా
విషాన్ని
భరిస్తున్న మేము విషం తిన్నవాడి కన్నా ఏం తక్కువ!!
అనుకొని
తమను తాము దేవతా మూర్తులుగా ప్రచారం చేసుకునే
సంస్కృతి
విస్తరించింది! శివో హం శివో హం శివో హం!
అమృతం మాకొద్దు గానీ
ఈవిషాలన్నిహరించ
గల ఔషదం మాత్రం కావాలి!!